ఇండియాకు చేరుకునే ప్రతి ప్రవాసీయుడు కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి చేసిన : సివిల్ ఏవియేషన్
- September 06, 2020
ఒమన్ నుంచి స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న ప్రవాస భారతీయులకు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది భారత పౌర విమానయాన సంస్థ. ఒమన్ నుంచి ఇండియాకు చేరుకున్న వారు, ఇతర కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా ఇండియా చేరుకున్నా..ఫ్లైట్ దిగగానే కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలని సూచించింది. టెస్ట్ ఫలితాల తర్వాత డొమస్టిక్ ఫ్లైట్స్ లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే..గతంలో ఫ్లైట్ ఎక్కే 96 గంటల్లోపు తీసుకున్న ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాలను తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ, ప్రయాణికులకు ప్రయాణ నిబంధనలను సులభతరం చేయటంతో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు 96 గంటల లోపు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి నిబంధనల్లో సడలింపు ఇచ్చారు. దీంతో కోవిడ్ 19 నెగటివ్ రిపోర్ట్ లేకున్నా..ఫ్లైట్ ఎక్కేందుకు అవకాశం ఇచ్చినట్లైంది. దీంతో అప్రమత్తమైన భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ...ఒమన్ లోని ప్రవాస భారతీయులు ఇండియా చేరుకోగానే ముందుగా కోవిడ్ 19 టెస్టులు చేసుకోవటం తప్పనిసరి చేసింది. అయితే..ప్రయాణికులకు సులభతరంగా ఉండేందుకు విమానాశ్రయ ఎంట్రీ పాయింట్లోనే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకునేలా ఎర్పాట్లు చేశారు. టెస్టులో నెగటివ్ వస్తే డొమస్టిక్ ఫ్లైట్ లోకి అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?