నిఖిల్ కుమార్, విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ ఫస్ట్‌లుక్ సెప్టెంబర్ 11న విడుదల
- September 06, 2020
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు యువరాజా నిఖిల్ కుమార్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు.
సెప్టెంబర్ 11న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది.
భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా పాపులర్ మ్యూజిక్ కంపెనీ లహరి మ్యూజిక్ అధినేత చంద్రు మనోహరన్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.
నిఖిల్ కుమార్ సరసన నాయికగా కశ్మీరా పరదేశి నటిస్తున్నారు.
అర్జున్ జన్యా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష ఎం. కుడువల్లి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణమవుతోంది.
తారాగణం:
యువరాజా నిఖిల్ కుమార్, కశ్మీరా పరదేశి, దత్తన్న, అచ్యుత కుమార్, రాజేష్ నటరంగ, శోభరాజ్, చిక్కన్న, శివరాజ్ కె.ఆర్. పీట్, నిహారిక, సంపద హుళివన, అనూష
సాంకేతిక బృందం:
రచన: నంద్యాల రవి, విజయ్ ప్రకాష్
డైలాగ్స్, కో-డైరెక్టర్: శరత్ చక్రవర్తి
మ్యూజిక్: అర్జున్ జన్యా
సినిమాటోగ్రఫీ: శ్రీష ఎం. కుడువల్లి
ఎడిటింగ్: కె.ఎం. ప్రకాష్
స్టంట్స్: డాక్టర్ రవివర్మ
ఆర్ట్: మోహన్ బి. కెరే
క్రియేటివ్ హెడ్: సునీల్ గౌడ
నిర్మాత: చంద్రు మనోహరన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







