వీసా ఆన్ అరవైల్ ను పునరుద్ధరించిన బహ్రెయిన్...68 దేశాలకు అనుమతి
- September 07, 2020
మనామా:దశల వారీగా అన్ లాక్ ప్రక్రియ అమలు చేస్తున్న నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్ చేరుకున్నాక ఇచ్చే వీసా(ఆన్ అరవైల్ వీసా) లను పురుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. 68 దేశాల పౌరులకు ఈ వెసులుబాటు కల్పించింది. దీంతో ఇక నుంచి ఆ 68 దేశాల పౌరులు గతంలో మాదిరిగా సులభంగా బహ్రెయిన్ చేరుకోవచ్చు. ఖతార్ మినహా జీసీసీ దేశాల నుంచి వీసా లేకుండానే బహ్రెయిన్ వెళ్లవచ్చు. చెల్లుబాటులో ఉన్న ఈ-వీసాదారులు, దౌత్యవేతలు, సైనికాధికారులు, విమాన సిబ్బంది, ఇతర ముఖ్య అధికారులు, ఐక్యరాజ్యసమితి పాస్ పోర్టు ఉన్నవారు బహ్రెయిన్ చేరుకున్నాక వీసా పొందవచ్చు. అయితే..బహ్రెయిన్ చేరుకున్నాక మాత్రం సొంతఖర్చులతో ఖచ్చితంగా ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలి. టెస్ట్ ఫలితాలు వచ్చే వరకు స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. బహ్రెయిన్ చేరుకున్నవారు ఒకవేళ 10 రోజులు అంతకుమించి దేశంలో ఉండాలనుకుంటే పదో ఖచ్చితంగా మరోసారి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆన్ అరవైల్ వీసా అర్హతకు సంబంధించి వివరాలను తెలుసుకోవాలనుకునే ప్రయాణికులు evisa.gov.bh. లింక్ తో వెబ్ సైట్ సందర్శించాలని కూడా బహ్రెయిన్ పౌర విమానయాన అధికారవర్గాలు సూచించాయి. అలాగే ప్రయాణానికి ముందు ఈ-వీసా పొందాలనుకునే వారు evisa. gov.bh. లింక్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







