అంతరాష్ట్ర ఇంటి దొంగలను అరెస్ట్ చేసిన శంషాబాద్ సీసీఎస్ పోలీసులు..
- September 07, 2020
హైదరాబాద్: అంతరాష్ట్ర ఇంటి దొంగలను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లాక్డౌన్లో తరచూ దొంగతనాలకు పాల్పడిన పఠాన్ చాంద్ బాషా, సబేర్‌లను అనే ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని 20 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ గుల్భార్గాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్లో మార్చి నుంచి జూలై వరకు వీరిద్దరూ 15 నేరాలకు పైగా పాల్పడ్డారని, ఇది వరకే వీరిపై తెలంగాణలో 15 పైగా కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.
గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనాలకు చాంద్ బాషా స్కేచ్ వేయగా.. దొంగలించిన సోత్తును సాబేర్ డిస్పోస్ చేసేవాడని విచారణలో నిందితులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో వారు తాండూరు వద్ద నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇక గుల్బర్గ హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడుకు వచ్చి దొంగతనాలకు పాల్పడేవారని, ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్‌లో తరచూ నిందితులు నేరాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు.



తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







