ఏపీలో ఆగని కరోనా విజృంభణ..
- September 07, 2020
అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో 72,573 శాంపిల్స్ ని పరీక్షించగా 10,794 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల చిత్తూర్ లో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, గుంటూరు లో ఎనిమిది మంది, ప్రకాశం లో ఎనిమిది మంది, కడప లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, కర్నూల్ లో నలుగురు, నెల్లూరు లో నలుగురు, శ్రీకాకుళం లో ఇద్దరు, విజయనగరం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 11,915 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 4,95,230 పాజిటివ్ కేసు లకు గాను 3,91,124 మంది డిశ్చార్జ్ కాగా.. 4,417 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 99,689 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!