ప్రయాణికులకు 5 బిలియన్ల దిర్హామ్ లను చెల్లించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్
- September 07, 2020
దుబాయ్:లాక్ డౌన్ సమయంలో విమాన టికెట్లను బుక్ చేసుకొని..ప్రయాణం చేయలేకపోయిన ప్రయాణికులకు టికెట్ ధరలను తిరిగి చెల్లిస్తోంది దుబాయ్ ఎమిరేట్స్ విమానయాన సంస్థ. ఇప్పటివరకు ఏకంగా 5 బిలియన్ల దిర్హామ్ లను ప్రయాణికులకు తిరిగి చెల్లించినట్లు తెలిపింది.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించటంతో మార్చి నుంచి దాదాపు 90 శాతం విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లంతా తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ సంస్థను కోరారు. ప్రపంచవ్యాప్తంగా తమ సర్వీసులలో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి విన్నపాలు వస్తున్నాయని..మార్చి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.4 మిలియన్ల ప్రయాణికులకు సంబంధించి టికెట్ ధరలను రిఫండ్ చేశామని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వివరించింది. డబ్బులు తిరిగి చెల్లించేందుకు సంస్థ భాగస్వామ్యుల సాయం కూడా తీసుకుంది. ప్రయాణికుల పక్షాన వారికి కలిగిన అసౌకర్యాన్ని అర్ధం చేసుకోగలమని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పరిష్కరించాల్సిన రిక్వెస్టులు ఎక్కువగా ఉన్నందువల్ల కొందరికి డబ్బు చెల్లించటంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు. అయితే..ప్రతి ప్రయాణికుడికి డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు సంస్థ పట్ల నమ్మకం, సహనంతో వ్యవహరించిన ప్రయాణికులను ప్రశంసించారు. ఇదిలా ఉంటే..దశలవారీగా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావటంతో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ తమ సర్వీసులను క్రమంగా పునరుద్ధరిస్తోంది. ప్రస్తుతం 80 నగరాలకు సర్వీసులను నడుపుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?