యూఏఈ:190 దిర్హామ్ లకు ఇంటి దగ్గరే కోవిడ్ టెస్ట్..ప్రకటించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్

- September 09, 2020 , by Maagulf
యూఏఈ:190 దిర్హామ్ లకు ఇంటి దగ్గరే కోవిడ్ టెస్ట్..ప్రకటించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్

యూఏఈ నుంచి ఇండియా వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కోవిడ్ 19 టెస్ట్ ప్యాకేజ్ ప్రకటించింది. ప్రయాణికులు కోరితే వారి ఇంటి వద్దే కోవిడ్ టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఎన్ఎంసీ హెల్త్ కేర్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎయిరిండియా ఎక్స్ ప్రెస్. యూఏఈ నుంచి భారత్ వెళ్లే ప్రయాణికులు కోరితే...190 దిర్హామ్ లకే ఇంటిదగ్గర కోవిడ్ 19 టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంటి దగ్గర చేయించుకునేందుకు సుముఖంగా లేని వ్యక్తులు యూఏఈ వ్యాప్తంగా ఉన్న ఎన్ఎంసీ హెల్త్ కేర్ క్లినిక్స్ లో టెస్టులు చేయించుకోవచ్చని..ఇందుకు 150 దిర్హామ్ లు ఛార్జ్ చేస్తారని వివరించింది. ఎన్ఎంసీ హెల్త్ కేర్ క్లినిక్స్ అబుధాబిలో 11, దుబాయ్ లో 4, షార్జాలో 8, రస్ ఆల్ ఖైమాలో ఒకటి ఉన్నాయి. ఇదిలాఉంటే..యూఏఈ నుంచి భారత్ వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేకున్నా..తప్పనిసరిగా చేయించుకుంటే మంచిదని దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అలాగే తమిళనాడు, పశ్చిమబెంగాల్ వెళ్లే వారు మాత్రం ఖచ్చితంగా విమానం ఎక్కే 96 గంటల్లో పరీక్ష చేసుకున్నట్లు కోవిడ్ 19 నెగటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com