సౌదీ:రహస్యంగా మహిళా ప్రయాణికుల ఫోటోలు తీస్తున్న టాక్సీ డ్రైవర్ అరెస్ట్
- September 09, 2020
రియాద్:మహిళా ప్రయాణికులను రహస్యంగా ఫోటోలు తీస్తున్న ఓ టాక్సీ డ్రైవర్ ను రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్లుగా రియాద్ లో టాక్సీ నడుపుతున్నాడు. అయితే..నిందితుడు తన టాక్సీలో ప్రయాణిస్తున్న మహిళలకు తెలియకుండా సీక్రెట్ ఫోటోలు తీసి సోషల్ మీడియా యాప్ లలో అప్ లోడ్ చేసేవాడని రియాద్ పోలీస్ సహాయక అధికార ప్రతినిధి తెలిపారు. యాంటీ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం నిందితుడ్ని అరెస్ట్ చేశామని, న్యాయవిచారణ జరిపి చట్టరిత్యా అతనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సౌదీ చట్టాల ప్రకారం అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు తీయటం నిషేధం. ఇతరులను ఫోటోలు దించితే..5 లక్షల రియాల్స్ జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







