అఖిల్ అక్కినేని-సురేందర్ రెడ్డి-అనిల్ సుంకరల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్
- September 09, 2020
హైదరాబాద్:యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది . అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.
తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రంలో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5 తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
హీరో: అఖిల్ అక్కినేని,
దర్శకత్వం: సురేందర్ రెడ్డి,
నిర్మాత: రామబ్రహ్మం సుంకర,
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి,
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







