ఐపీఎల్‌ 2020:దుబాయ్‌కి బయల్దేరిన సౌరవ్‌ గంగూలీ

- September 09, 2020 , by Maagulf
ఐపీఎల్‌ 2020:దుబాయ్‌కి బయల్దేరిన సౌరవ్‌ గంగూలీ

సెప్టెంబర్‌ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2020 నిమిత్తం దుబాయ్‌కి బయల్దేరారు బిసిసిఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ. కాగా, సెప్టెంబర్‌ 19న జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టుతో తలపడనున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, ఆరు నెలల తర్వాత తొలిసారిగా తాను విమానయానం చేస్తున్నానని పేర్కొంటూ సౌరవ్‌ గంగూలీ సోషల్‌ మీడియాలో ట్వీటేశారు. ఫేస్‌ మాస్క్‌ ధరించి, విమానం పక్కనే నిలబడి వున్న ఫొటోని షేర్‌ చేశారు సౌరవ్‌ గంగూలీ. టీ20 వరల్డ్‌ కప్‌ పోస్ట్‌పోన్‌ కావడంతో, ఐపీఎల్‌ని ఆ స్థానంలో తీసుకురాగలిగారు. అన్ని ప్రత్యేక జాగ్రత్తలూ తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్‌ని యూఏఈలో నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com