దుర్గమ్మ దసరా ఉత్సవాలపై కీలక నిర్ణయం

- September 10, 2020 , by Maagulf
దుర్గమ్మ దసరా ఉత్సవాలపై కీలక నిర్ణయం

విజయవాడ:కరోనా కారణంగా ఈ ఏడాది ఉగాది నుంచి వరసగా అన్ని పండుగలను ఇంట్లోనే జరుపుకున్నారు.అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో పండుగలను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఇదిలా ఉంటె,విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆలయ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వచ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు దసరా మహోత్సవాలు జరగబోతున్నాయి.దసరా మహోత్సవాల సమయంలో రోజుకు 10వేలమందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.  ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.దేవస్థానం సిబ్బంది, అర్చకులకు కరోనా టెస్టులు తప్పనిసరి.ఇక అమ్మవారి దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com