హైదరాబాద్ నుంచి దుబాయ్ కు ఎమిరేట్స్ ఫ్లైట్లు ప్రారంభం
- September 11, 2020
హైదరాబాద్:అంతర్జాతీయ విమాన ప్రయాణాలు తిరిగి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం యూఏఈ దేశంతో కుదిరిన 'ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్' ఒప్పందం కింద GMR నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ కి విమాన సర్వీసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
విమాన ప్రయాణాలనికి ఇది పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి మధ్య విమాన రంగం తిరిగి కోలుకునే సంకేతాలను చూపుతోంది.హైదరాబాద్ నుండి దుబాయ్ మధ్య యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో వారానికి 3 సర్వీసులను నిర్వహిస్తుంది. ఎమిరేట్స్ మొదటి విమానం (EK 526), BOEING 777- 300 ER విమానం ప్రయాణికులతో ఉదయం 8.25 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంది.
తిరిగి 10 గంటలకు ప్రయాణికులతో EK 527 విమానం దుబాయ్‌కి బయలుదేరింది.యూఏఈ కి చెందిన ఎమిరేట్స్ విమానయాన సంస్థ వారంలో మూడుసార్లు విమానాలను నడిపిస్తుంది.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవచ్చు.అలాగే కోవిడ్ -19 భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి అని తెలిపింది.హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే పలు జాగ్రత్తల మధ్య అంతర్జాతీయ విమానాల సర్వీసులు నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన