ఆమ్రపాలికి ప్రమోషన్..PMO డిప్యూటీ సెక్రటరీగా పోస్ట్..
- September 13, 2020
తెలంగాణ:2010 బ్యాచ్‌కు చెందిన అమ్రపాలి తొలిసారిగా వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసేటప్పుడు ఆమె విశేష మైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభిచింది.ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా ఆమె నియమితు లయ్యారు.పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె కూడా స్థానం దక్కించు కున్నారు.పీఎంవో కార్యాలయంలో కొత్తగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు నియమితులయ్యారు.ఈ మేరకు కేబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా నియమితులైన ఐఏఎస్ అధికారుల్లో మధ్యప్రదేశ్ 2004 కేడర్‌కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్, ఆంధ్రప్రదేశ్ 2010 కేడర్‌కు చెందిన అమ్రపాలి కాట, ఉత్తరాఖండ్ 2012 కేడర్‌కి చెందిన మంగేష్ గిల్దియాల్ ఉన్నారు.ఐఏఎస్ రఘురాజ్ రాజేంద్రన్ పీఎంవో కార్యాలయ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.ఇంతకు ముందు ఆయన స్టీల్, పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సెక్రటరీగా సేవలందిం చారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ మంగేష్ గిల్దియాల్ తాజాగా పీఎంవో అండర్ సెక్రటరీగా నియమితులయ్యారు.
మరో ఐఏఎస్ అమ్రపాలి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.తాజాగా PMO డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక అంతకు ముందు అమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా విధులు చేపట్టారు.ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణి గా సేవలందించారు.అనంతరం ఆమె కేంద్ర సర్వీసు ల్లోకి వెళ్లారు.ఇక అంతకు ముందు అమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా విధులు చేపట్టారు.ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణి గా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన