అక్టోబర్ 16న బతుకమ్మ పండుగ ప్రారంభం:కల్వకుంట్ల కవిత
- September 15, 2020
హైదరాబాద్:అక్టోబర్ 16 నుండి 24 వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సూచించిన మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ తేదీలపై మాజీ ఎంపీ కవితను కలసిన ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని సిద్ధాంతులు, పండితులు అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శాస్త్ర ప్రకారం పండుగ తేదీల్లో మార్పు.
ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24 తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన ‘తెలంగాణ విద్వత్సభ’తో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చర్చించారు.
అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం లో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు గాను, ‘తెలంగాణ విద్వత్సభ’ ప్రతినిధులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి, పండుగ తేదీలపై చర్చించారు. అంతకంటే ముందు ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని 32 మంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు , పండుగ తేదీలపై ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణాకే తలమాణికంగా నిలిచిందని మాజీ ఎంపీ కవిత గుర్తు చేశారు. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల పండుగ తేదీలపై కొంత సందేహాలు ఉన్నాయన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలో పండితుంతా చర్చించి ఈ సంవత్సరం పండగ తేదీలను శాస్త్ర ప్రకారం నిర్ణయించారని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ సంవత్సరం అధిక మాసాన్ని పరిగణలోకి తీసుకని, ప్రతి సంవత్సరం లాగ బాధ్రపద మాసంలో కాకుండా, అశ్వయుజ మాసంలో( అక్టోబర్) 16 వ తేదీన బతుకమ్మను ప్రారంభించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.
బాధ్రపద మాసంలో వచ్చే ఎంగిలిపూల అమావాస్య రోజు బతుకమ్మను ప్రారంభించాలని కొంతమంది ప్రతిపాదనలు చేశారన్నారు మాజీ ఎంపీ కవిత. 'మొదటి రోజు చేసుకునే గౌరమ్మకు, నెలరోజుల పాటు పూజలు చేసుకుని, అక్టోబర్ లో వచ్చే దుర్గాష్టమి రోజు వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవచ్చు. అయితే బతుకమ్మను ప్రారంభించి, పూజలు చేయకపోవడం సరైనది కాదని వేదపండితులు తెలిపార'న్నారు మాజీ ఎంపీ కవిత. తెలంగాణ జాగృతి చాలా సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున, చాలా మంది బతుకమ్మ తేదీల గురించి తనను సంప్రదించారని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. దీంతో ‘తెలంగాణ విద్వత్సభ’ సలహా మేరకు అక్టోబర్ 16 తేదీన బతుకమ్మ పండుగను ప్రారంభించి, అక్టోబర్ 24 తేదీ వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ కవిత తెలిపారు. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారని మాజీ ఎంపీ కవిత అన్నారు.పండితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్ 16 న బతుకమ్మను ప్రారంభించాలని తెలంగాణ ఆడపడుచులను మాజీ ఎంపీ కవిత కోరారు.
‘తెలంగాణ విద్వత్సభ’ రాష్ట్ర అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, ఇతర పండితులు, మాజీ ఎంపీ కవితను కలిసారు.

తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







