ఉత్తమ నగరంగా హైదరాబాద్
- September 15, 2020హైదరాబాద్:హైదరాబాద్ కి మరో విశిష్ట ఘనత దక్కింది.భారత దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరాబాద్ నగరం ఎంపికైంది. హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు నిర్థారణ అయింది. నివాసయోగ్యం, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా సర్వేలో తేలింది.ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ మొదలైనవి పర్యాటకుల దృష్టిని ఆకర్షించినట్లు వెల్లడైంది.హైదరాబాద్ పర్యాటక కేంద్రాల్లో చరిత్రాత్మక చార్మినార్, గొల్కొండ కోట నిలిచాయి. ఆయా నగరాల్లో పటిష్ఠమైన అవకాశాలు, సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలతో ఈ సర్వేను నిర్వహించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం