వాషింగ్టన్ వేదికగా చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై యూఏఈ-ఇజ్రాయోల్ సంతకాలు

వాషింగ్టన్ వేదికగా చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై యూఏఈ-ఇజ్రాయోల్ సంతకాలు

అమెరికా:మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి చారిత్రాత్మక ఘటనకు వాషింగ్టన్ వేదికగా నిలిచింది. గత నెలలో శాంతి పునరుద్ధరణ, దౌత్య సంబంధ ఒప్పందంపై అంగీకారం తెలిపిన ఇజ్రాయోల్, యూఏఈ...ఇప్పుడు దౌత్య ఒప్పందానికి సంబంధించి పరస్పరం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ..ఈ శాంతి ఒప్పందం యూఏఈ, ఇజ్రాయోల్ మధ్య దౌత్య పురోభివృద్ధికి అలాగే మధ్య ప్రాచ్య దేశాల పురోభివృద్ధికి కూడా  తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అయితే..ఈ ఒప్పందం పాలస్తీనా హక్కులకు, దేశపరిరక్షణకు ఏ విధంగానూ ఆటంకం కలిగించబోదని ఆయన అన్నారు. పాలస్తీనాకు మునుపటి తరహాలో తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు అడుగులు పడుతున్న ప్రస్తుత సమయంలో పాలస్తీనా కూడా కొన్ని సానుకూల విధానాలతో ముందుకు రావాలని ఆయన సూచించారు. 

 

Back to Top