ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌కి 500,000 రియాల్‌ జరీమానా, లైసెన్స్‌ రద్దు

ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌కి 500,000 రియాల్‌ జరీమానా, లైసెన్స్‌ రద్దు

రియాద్: సౌదీ షురా కౌన్సిల్‌, ఫారిన్‌ ఇన్వెస్టిమెంట్‌ చట్టానికి కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పు ప్రకారం, నిబంధనల్ని ఉల్లంఘించిన ఫారిన్‌ ఇన్వెస్టర్‌కి 500,000 రియాల్స్‌ జరీమానా విధించే అవకాశం వుంటుంది. అలాగే, ఇన్వెస్టిమెంట్‌ లైసెన్స్‌ కూడా రద్దు చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. హౌస్‌ రెగ్యులర్‌ సెషన్‌లో ఈ అమెండ్‌మెంట్‌ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశానికి స్పీకర్‌ షేక్‌ డాక్టర్‌ అబ్దుల్లా అల్‌ షేక్‌ నేతృత్వం వహించారు. ఎకనమిక్‌ అండ్‌ ఎనర్జీ కమిటీ సబ్‌మిట్‌ చేసిన రిపోర్ట్‌ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. 2005 వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ తర్వాత అంతర్జాతీయ భాదస్వామ్యాలతో కింగ్‌డం పెద్దయెత్తున ఇన్వెస్టిమెంట్స్‌ రంగంలో రాణిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ కమర్షియల్‌ రూల్స్‌ మరియు స్టాండర్డ్స్‌కి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తోంది తమ నిర్ణయాల్లో.

Back to Top