భారత దేశంలో నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్-మేయర్ బొంతు రామ్మోహన్
- September 16, 2020
హైదరాబాద్:భారత దేశంలో నివాసయోగ్యమైన ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమమైన నగరంగా నిలిచిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో బెస్ట్ లివెబుల్ సిటీగా హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. చారిత్రక గొప్పదనంతో పాటు మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది, ఆర్థిక ప్రగతిలో హైదరాబాద్ ఉత్తమ పర్యాటక నగరంగా స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్దికి రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షల మేరకు రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్, జంక్షన్ల అభివృద్ది, స్లిప్ రోడ్లు, లింక్‌రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నగరంలో వివిధ రంగాల్లో రూ. 50వేల కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో రూ. 30 వేల నుండి రూ. 40వేల కోట్ల వరకు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో నీటి కొరత, విద్యుత్ అంతరాయం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ సమస్యలు లేవని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడలు పుంజుకోవడానికి, నివాసయోగ్యతకు అనువైనదిగా తెలిపారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







