కోవిడ్ 19 నియంత్రణ ఉత్పత్తుల స్మగ్లింగ్ లను అడ్డుకోవటంలో ఖతార్ కు ఫస్ట్ ప్లేస్
- September 16, 2020దోహా:కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో పలు దేశాల్లో కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. కొన్ని దేశాలైతే ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో కోవిడ్ 19 నియంత్రణ వైద్య పరికరాలు, మాత్రలు, ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అయితే..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ ఉత్పత్తులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవటంతో ఇదే అదనుగా కొందరు అక్రమార్జన కోసం ఉత్పత్తులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న విషయం తెలిసింది. కోవిడ్ 19 నియంత్రణ ఉత్పత్తులు ప్రజలకు అత్యవసరంగా మారిన ప్రస్తుత సమయంలో బ్లాక్ మార్కెట్ స్మగ్లర్లను నిరోధించటంలో ఖతార్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. కోవిడ్ 19 నియంత్రణ ఉత్పత్తుల స్మగ్లింగ్ ను అడ్డుకోవటంలో ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో నిలిచినట్లు ఖతార్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బ్లాక్ మార్కెట్ దందా నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో క్రిమిసంహారక ఉత్పత్తులు, శానిటైజర్లు, మాస్కులను స్వాధీనం చేసుకుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ