తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా పాజిటివ్ కేసులు..
- September 17, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 2,159 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అలాగే బుధవారం ఒక్కరోజే కరోనాతో 9 మంది మరణించారు. దాంతో రాష్ట్రంలో 1005కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా GHMCలో 318 నిర్ధారణ కాగా, తర్వాత రంగారెడ్డి 176, నల్గొండ 141, సిద్దిపేటలో 132, మేడ్చల్ మల్కాజ్గిరి 121, కరీంనగర్ 127, వరంగల్ అర్బన్‌లో 98 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే గత 24 గంటల్లో 2,108 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారు 1,33,555 గా ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







