ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏ.పి గవర్నర్
- September 17, 2020
విజయవాడ:దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ గురువారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిని ఉద్దేశించి రాసిన లేఖలో గవర్నర్ శ్రీ హరిచందన్ మోదీ పుట్టినరోజు నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పలు తుఫానులను సమర్ధవంతంగా ఎదుర్కుందని, ప్రధాని మార్గనిర్ధేశకత్వంలో కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుండి సైతం మన దేశం త్వరలోనే విజయవంతంగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని తన రాజకీయ చతురత, నేర్పు, ఓర్పులతో నరేంద్ర మోదీ ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. ప్రధాని మంచి ఆరోగ్యం, ఆనందాలతో ఫలవంతమైన జీవితం గడపాలని గవర్నర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!