కోవిడ్ 19: వేడుకలైనా, అంత్యక్రియలైనా 10 మందికే అనుమతి..యూఏఈ కొత్త మార్గదర్శకాలు
- September 19, 2020
యూఏఈ: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇంట్లో జరిగే ఏ శుభకార్యాలైనా పది మందికి మించి జనం ఉండకూడదని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు..అంత్యక్రియలకు కూడా పది మించి హజరుకావొద్దని వెల్లడించింది. కోవిడ్ 19ను అడ్డుకునేందుకు కుటుంబ వేడుకల విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ అధికార విభాగం ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జన సమూహాలను వీలైనంత మేర నియంత్రించటం..తద్వారా కోవిడ్ చైన్ బ్రేక్ చేయటమే లక్ష్యంగా వేడుకలకు హజరయ్యే అతిధిల సంఖ్యను కేవలం పది మందికే పరిమితం చేసింది. ఇక నుంచి ఇంట్లో జరిగే ఏ వేడుకకైనా అతి ముఖ్యమైన కుటుంబసభ్యులు అది కూడా 10 మందికి మించకుండా హజరవ్వాలని సూచించింది. అంతేకాదు..వేడకలో బఫెట్ విధానాన్ని పూర్తిగా నిషేధించింది. ఖచ్చితంగా డిస్పోజల్ ప్లేట్లు, గ్లాసులను మాత్రమే వాడాలని కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. వేడుకలకు హజరయ్యే ఆ 10 మంది కూడా 24 గంటల ముందే కోవిడ్ టెస్టులు చేయించుకుంటే ఉత్తతమమని వెల్లడించింది. ఒకవేళ ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే..వారిని ఐసోలేట్ చేసేందుకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఇదిలాఉంటే అంత్యక్రియల విషయంలో కొత్త నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించింది. అంత్యక్రియలకు హజరయ్యే వారి సంఖ్య ఎట్టిపరిస్థితుల్లో 10 మందికి మించి ఉండొద్దని, స్మశానవాటికల్లోని సిబ్బంది ఖచ్చితంగా గ్లౌజులు, మాస్కులు ధరించాలని సూచించింది. ఒకవేళ సిబ్బందిలో ఎవరైనా శ్వాసకోసం ఇబ్బందులు ఉన్నా..కరోనా లక్షణాలు కనిపించినా వారు అంత్యక్రియలకు హజరుకావొద్దని NCEMA పేర్కొంది. వేడుకలు, అంత్యక్రియల సమయంలో NCEMA విడుదల చేసిన మార్గనిర్దేశకాలను అమలు చేసే బాధ్యత స్థానిక అధికారులదేనని, స్థానిక అధికారులు వారి పరిధిలో జరిగే వేడుకలను పర్యవేక్షించి నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్







