విమానాల్ని పునరుద్ధరించనున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
- September 19, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి అలాగే దుబాయ్‌కి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలపై దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిషేధం విధించినప్పటికీ, షెడ్యూల్స్ ప్రకారమే తమ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా యూఏఈకి తమ వెంట కరోనాని తీసుకువచ్చిన దరిమిలా, దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేట్ అవ్వాల్సిన విమానాలు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేట్ కానున్నాయి. రీషెడ్యూల్ అయిన విమానాలు కాలికట్, తిరువనంతపురం, ముంబై మరియు కన్నూర్‌లకు చేరుకోనున్నాయి. శుక్రవారం విమానాలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆపరేట్ అయ్యాయని ఎయిర్‌లైన్ అఫీషియల్ ఒకరు చెప్పారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







