ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి అంతా సిద్ధం
- September 19, 2020
అబుధాబి:మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభం కాబోతోంది. కరోనా నేపథ్యంలో ఇండియా నుంచి ఐపీఎల్ వేదిక యూఏఈకి మారిన విషయం విదితమే. రానున్న 52 రోజులు క్రికెట్ అభిమానుల్ని నరాలు తెగే ఉత్కంఠతో ఐపీఎల్ పోటీలు అలరించనున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి పోరు ఈ సీజన్‌లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన క్రికెటర్ ధోనీ, ఈ ఐపీఎల్ ద్వారా తన అభిమానుల్ని అలరించబోతున్నాడు. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ మరియు షార్జాలలో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇండియన్ క్రికెటర్స్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకూ యూఏఈ రెండో హోం గ్రౌండ్ అనే అభిప్రాయం క్రికెట్ విశ్లేషకుల్లో వుంది. అయితే, స్టేడియంలలో ఇదివరకటిలా అభిమానుల కోలాహలం లేకపోవడంతో ఈ మ్యాచ్‌లు ఎలా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..