బహ్రెయిన్: మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఫోర్జరీ కేసులో ముగ్గురికి జైలు శిక్ష
- September 20, 2020
మనామా:మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఫోర్జరీ కేసులో ఆరోపణలు రుజువు కావటంతో ముగ్గురు దోషులకు ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడింది. ముగ్గురు దోషుల్లో ఇద్దరు అసియన్లు, ఒక బహ్రెయినీ వ్యక్తి ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి వందల కొద్ది మెడికల్ ప్రిస్క్రిప్షన్లు ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నరాల సమస్యతో కలిగే నొప్పిని అరికట్టేందుకు వినియోగించే లిరికా మెడిసిన్ ను పొందేందుకు ఏకంగా 404 ఫోర్జరీ ప్రిస్క్రిప్షన్లను తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. జాతీయ ఆరోగ్య నియంత్రణ అధికారులు ఫార్మసీలను తనిఖీ చేసిన సమయంలో ఈ ఫోర్జరీ ప్రిస్క్రిప్షన్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ ఫార్మసీలో ఏకంగా అంతర్గత మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుపుతూ సంతకం చేసినట్లుగా ఉన్న ప్రిస్క్రిప్షన్లను పెద్దమొత్తంలో కనుగొన్నారు. అనారోగ్యం బారిన పడిన తమ సిబ్బంది కోసం టోకుగా లిరికా మాత్రలకు ఆర్డర్ చేసినట్లు కవరింగ్ ఇచ్చారు. అయితే..హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ దీనిపై అనుమానం వచ్చి దర్యాప్తు చేయటంతో ఆ ప్రిస్క్రిప్షన్లు అన్ని ఫోర్జరీవని తేలింది. ఫోర్జరీకి పాల్పడిన ఇద్దరు అసియన్లతో పాటు బహ్రెయిన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన మేజర్ క్రిమినల్ కోర్టు దోషులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం అసియన్లపై దేశ బహిష్కరణను కూడా అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన