కువైట్: జనసమూహాలు, కోవిడ్ నిబంధనలపై ఉల్లంఘనలపై కఠిన చర్యలు

- September 21, 2020 , by Maagulf
కువైట్: జనసమూహాలు, కోవిడ్ నిబంధనలపై ఉల్లంఘనలపై కఠిన చర్యలు

కువైట్ సిటీ:కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రి మండలి సూచించిన నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కువైట్ హెచ్చరించింది. సమాజ భద్రత కోసం పౌరులు, ప్రవాసీయులు అంతా ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. మంత్రిమండలి సూచనలకు విరుద్ధంగా జనం సమూహంగా చేరినా..ఇతర ఆరోగ్య రక్షణ సూచనలను పాటించకపోయిన చర్యలు తీవ్రంగా ఉంటాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అంతర్గత మంత్రిత్వ శాఖ..ఎప్పకప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి జనం గుమికూడకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు వెల్లడించింది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఈవెంట్లు ప్రచారం చేస్తున్న వారిని కూడా మంత్రిత్వ శాఖ అధికారులు సంప్రదిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించటంలో విఫలమైన ఈవెంట్ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే బహిరంగ ప్రదేశాల్లో, వాణిజ్య కేంద్రాలు, షాపింగ్ మాల్స్ లో ప్రజలు అంతా ఫేస్ మాస్కులు ధరించాలంటూ ఇప్పటికే ప్రచారం చేపట్టారు. ఎవరైనా మాస్కులు ధరించకుంటే జరిమానా విధిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com