ప్రయాణికులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి:ఒమన్
- September 21, 2020
మస్కట్:అక్టోబర్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు సిద్ధమవుతున్న ఒమన్ ప్రభుత్వం..ప్రయాణికులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది.ప్రయాణికుల భద్రత కోసం విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై దృష్టి సారిస్తూనే..కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలపై ఒమన్ పౌర విమానయాన అధికార విభాగం కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా విదేశాల నుంచి ఒమన్ చేరుకునే ప్రయాణికులు అంతా తప్పనిసరిగా ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.ఇక ఒమన్ లో ఉద్యోగం చేసే వారు కంపెనీ స్పాన్సర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ చూపించాలి.అలాగే సదరు ప్రయాణికుడి జర్నీలో అధికారులు ఎప్పుడు అడిగినా సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. గమ్యస్థానం చేరుకున్న తర్వాత కూడా అధికారులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. స్పాన్సర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుంటే అతన్ని ప్రయాణానికి అనుమతించరు.ఇక కరోనా నేపథ్యంలో ఒమన్ చేరుకున్న ప్రతి ప్రయాణికుడు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. పరీక్ష ఫలితాలు వచ్చే వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలి.అలాగే కనీసం 30 రోజులు పాటు ఆస్పత్రి ఖర్చులు వర్తించేలా బీమా చేసుకొని ఉండాలని ఒమన్ పౌర విమానయాన అధికార విభాగం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







