కువైట్:క్వారంటైన్ గడువును 7 రోజులకు కుదించాలని ప్రతిపాదించిన డీజీసీఏ
- September 21, 2020
కువైట్ సిటీ:కువైట్ లో క్వారంటైన్ గడువు ఇక నుంచి ఏడు రోజులే ఉండే అవకాశాలున్నాయి. విమాన ప్రయాణికుల క్వారంటైన్ కాలపరిమితిని 7 రోజులకు తగ్గించాలని కువైట్ పౌర విమానయాన సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం కువైట్ చేరే విమాన ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన అమలులో ఉంది. అయితే..ఈ సమాయాన్ని సగం రోజులకు తగ్గించాలన్నది డీజీసీఏ ప్రతిపాదన. అంతేకాదు..ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు లేఖ రాసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 14 రోజుల క్వారంటైన్ కాలపరిమితిని 7 రోజులకు కుదించాలని కోరింది. అయితే..ప్రయాణికులు అందరూ కోవిడ్ లేదని నిర్దారించే ఆర్టీ పీసీఆర్ నెగటీవ్ సర్టిఫికెట్ ను చూపించాల్సిందేనని పేర్కొంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







