హైదరాబాద్ నుంచి ఖతార్,యూఏఈ కి విమాన సర్వీసులు పున:ప్రారంభం
- September 21, 2020
హైదరాబాద్:ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా, భారత్, ఖతార్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందం ప్రకారం GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ రాజధాని దోహాకు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఊతం ఇస్తుంది. హైదరాబాద్,దోహాల మధ్య ఈ నెల 13 నుంచి వారానికి రెండుసార్లు ఖతార్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇవి శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతాయి.
అదే విధంగా, ఎతిహాద్ ఎయిర్‌వేస్ హైదరాబాద్ నుంచి UAE రాజధాని అబుధాబికి తన సర్వీసులను ప్రారంభించింది. ఎతిహాద్ సర్వీసులు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు – గురు, శుక్ర, ఆదివారాలలో ఉంటాయి.
ఈ సర్వీసులపై కార్తిక్ విశ్వనాథన్, ఏరియ సేల్స్ మేనేజర్, ఖతార్ ఎయిర్ వేస్, ‘‘ఎయిర్ బబుల్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ నుంచి తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించడం మాకెంతో సంతోషకరం. ఎలాంటి విపత్తుల సమయంలోనైనా మేమెంత దృఢచిత్తంతో ఉన్నామో తెలియజేస్తుంది. ప్రయాణికులను విదేశాలలోని తమవారి చెంతకు చేర్చడానికి మేం నిరంతరం కృషి చేస్తున్నాము’’ అన్నారు.
నీరజ్ భాటియా, వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ సబ్ కాంటినెంట్,ఎతిహాద్ ఎయిర్ వేస్, ‘‘హైదరాబాద్ నుంచి మా షెడ్యూల్ సర్వీసులను తిరిగి ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది. కఠినమైన నియమాలను సడలించి, ఈ రూట్ లో సర్వీసులను ప్రారంభించడం ప్రయాణికులకు చాలా సంతోషం కలిగించే వార్త. గత రెండు నెలలుగా మా సర్వీసులను, మేమందించే సేవలను మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చేందుకు అనేక చర్యలు తీసుకున్నాము. మా ప్రయాణికులు, భాగస్వాములు ఇంకా మా మీద నమ్మకాన్ని ఉంచినందుకు మా ధన్యవాదాలు’’ అన్నారు.

భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దోహాకు టికెట్టును బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులందరూ కోవిడ్-19 మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.
ఈ విమానాల ద్వారా వెళ్లే ప్రయాణికులంతా పూర్తిగా శానిటైజ్ చేసిన GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చెందిన అంతర్జాతీయ డిపార్చర్ టెర్మినల్ గుండా తరలివెళతారు టెర్మినల్‌లోనికి ప్రవేశించడానికి ముందే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా నిర్వహించే థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలు సహా అన్ని భద్రతాపరమైన చర్యలనూ తీసుకోవడం జరుగుతుంది.

కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి భారత ప్రభుత్వం అన్‌లాక్ 3.0 సందర్భంగా, వివిధ దేశాలతో ‘‘ట్రాన్స్‌పోర్ట్ బబుల్స్’’ లేదా ‘‘వాయు రవాణా ఒప్పందాలు’’ అనే తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతించింది. దీని కింద ఏవైనా రెండు దేశాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దైన రెగ్యులర్ అంతర్జాతీయ సర్వీసులను పున: ప్రారంభించుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే పలు జాగ్రత్తల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి లండన్ కు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమాన సర్వీసుల్ని ప్రారంభించగా; ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయిలు UAE లోని షార్జా, దుబాయిలకు తమ సర్వీసుల్ని ప్రారంభించాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అతి తక్కువ ప్రయాణ సమయంతో, అత్యంత జాగ్రత్తల మధ్య జరిగే విమాన ప్రయాణాలే అత్యంత సురక్షితమైనవిగా తేలింది.
తాజా వార్తలు
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!







