SRH పై RCB విజయం
- September 22, 2020
దుబాయ్:దుబాయ్ ఇనేర్నాషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి సన్‌రైజర్స్ ముందు 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టు 19.4 ఓవర్లకే అన్ని వికెట్లను కోల్పోయి పరాజయం పాలైంది.
సన్‌రైజర్స్ జట్టు మొదట గట్టిపోటీనే ఇచ్చినప్పటికి.. పరుగుల వరద పారిస్తున్న బెయిర్‌స్టో(43 బంతుల్లో 61 పరుగులు)ను చాహల్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. ఇక బెయిర్‌స్టో తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విజయ్ శంకర్‌ను కూడా ఒక బంతికే చాహల్ పెవిలియన్‌కు పంపాడు. ఇక అక్కడి నుంచి బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. సన్‌రైజర్స్ జట్టు 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోగా.. 153 పరుగులకు ఆల్ ఔట్ అయిపోయింది. చాహల్ ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లను తీసి సత్తా చాటాడు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!