జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప కన్నుమూశారు
- February 11, 2016
సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత బయటపడిన జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప గురువారం కన్నుమూశారు. అతను ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.అతను ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం గం.11.45ని.లకు కన్నుమూశారు. అతను కోలుకోవాలని భారత్ యావత్తు పూజలు, ప్రార్థనలు చేసింది.జమ్మూ కాశ్మీర్లోని సియాచిన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డ ఘటనలో పదిమంది ఆర్మీ జవాన్లలో హనుమంతప్ప సజీవంగా బయటపడ్డారు. లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరు రోజులుగా మంచు చరియల కింద సజీవంగానే ఉన్నాడు.పది రోజుల రోజుల క్రితం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు పది మంది జవాన్లు చిక్కుకున్నారు. సియాచిన్ ప్రాంతంలో తాము రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుండగా లాన్స్ నాయక్ హనమంతప్ప సజీవంగా కనిపించారని, మిగిలినవాళ్లంతా మరణించారని జీఓసీ నార్తన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా మంగళవారం తెలిపారు.సియాచిన్ ఘటనలో మిగతా తొమ్మిది మంది జవాన్లు మృత్యువాతపడ్డారు. అయితే సహచరులు ఏ ఒక్కరైనా బతికి ఉంటారన్న ఆశతో సైనికులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 25 ఫీట్ల మంచు కింద హనమంతప్ప రెస్క్యూ సిబ్బందికి సజీవంగా కనిపించాడు. అతను ఈ రోజు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







