వృత్తికే వన్నె తెచ్చిన కర్తవ్యం...
- September 26, 2020
మచిలీపట్నం:జోరువానలో వృత్తి ధర్మాన్ని నిర్వహించిన కానిస్టేబుల్ -982.D. శ్రీనివాసును సత్కరించిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు.
హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద నిరంతరం వాహన రాకపోకలతో రద్దీగా ఉంటుంది.అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి స్తంభించిపోయే అవకాశం ఉన్న ప్రాంతం.
హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్- 982 డి.శ్రీనివాసు 25.09.2020 వ తేదీ సాయంత్రం జంక్షన్ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో, అనుకోకుండా ఒక్కసారిగా వర్షం ప్రారంభం కావడంతో, ఏమాత్రం వెను తిరగకుండా జోరు వానలో తడుస్తూనే వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించాడు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువాన, క్షణం ఆలస్యం చేస్తే భారీగా నిలిచిపోయే ట్రాఫిక్, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధినిర్వహణలో నిమగ్నమై కానిస్టేబుల్ చూపిన చొరవ కు, రాష్ట్ర హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత, రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సామాజిక మాధ్యమం వేదికగా కానిస్టేబుల్ యొక్క సేవకు అభినందనలు తెలుపగా, ఈరోజు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు జిల్లా పోలీసు కార్యాలయం లో దుశ్శాలువతో సత్కరించి తను చేసిన సేవకు ప్రోత్సాహకంగా నగదు రివార్డును అందజేసి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!