మస్కట్: బయల్దేరే ముందే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని IATA సూచనలు

- September 27, 2020 , by Maagulf
మస్కట్: బయల్దేరే ముందే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని IATA సూచనలు

మస్కట్:కోవిడ్ ప్రభావంతో అంతర్జాతీయ విమానయాన రంగం కుదేలైపోయింది. విమానయాన రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా పలు అంతర్జాతీయ సంఘాలు, సంస్థలు ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్నాయి. అదే సమయంలో ప్రయాణికుల ఆరోగ్య భద్రతపై కూడా పకడ్బందీ జాగ్రత్తలను అనుసరిస్తున్నాయి. అయితే.. ప్రయాణికుల విషయంలో ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనురిస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రయాణికులు తమ దేశంలోకి వచ్చాక కోవిడ్ పరీక్షలు నిర్వహించి..ఫలితాలు వచ్చే వరకు వారిని క్వారంటైన్ లో ఉంచుతున్నాయి. అయితే..దీనికి ప్రత్యామ్నాంగా ప్రయాణికులు బయల్దేరే ముందే ఖచ్చితమైన ఫలితాలతో కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం సూచించింది. ప్రయాణికులకు సులువుగాను విమాన ప్రయాణాలను సులభంగా మార్చే క్రమంలో వైద్య నిపుణులు..అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థతో కలసి కార్యచరణ రూపొందించుకుంటున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి కూడా క్వారంటైన్ కు ప్రత్యామ్నంగా ప్రయాణికులకు ముందుగానే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అభిప్రాయపడింది. ఇదిలాఉంటే కోవిడ్ ప్రభావంతో ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 5.6 బిలియన్లు తగ్గిందని..దీంతో 104.5 బిలియన్ డాలర్ల ఆదాయం కొల్పోయినట్లు అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి వివరించింది. విమాన రంగంలోని 60 ఉద్యోగులపై దీని ప్రభావం పడిందని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com