రియాద్: మినహాయింపు వర్గాలకి ప్రయాణ అనుమతికి షరతులు
- September 27, 2020
రియాద్:కోవిడ్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన ప్రస్తుత సమయంలో కొన్ని మినహాయింపు వర్గాలకు ప్రయాణ అనుమతులకు సంబంధించి షరతులను ప్రకటించింది పాస్ పోర్ట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం. ప్రయాణ అనుమతికి అర్హులైన వారిలో తొలిగా పలు విభాగాల్లో అధికారిక కార్యాకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన వారు ప్రయోజనం పొందనున్నారు. అధికారులు తమకు నిర్దేశించిన విధులను వర్చువల్ విధానంలో, ఆన్ లైన్ ద్వారాగానీ చేయలేని పరిస్థితులు ఉన్నా..వ్యక్తిగతంగా తమ హాజరు తప్పరిసరి అయినా..ఆ విధులను నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాల్సి ఉన్న వారికి ప్రయాణ అనుమతి
ఇవ్వనున్నారు. అలాగే సౌదీ జాతీయుల బంధువులు విదేశాల్లో ఉన్నట్లైతే..వాళ్లు కింగ్డమ్ వచ్చే పరిస్థితులు లేని సందర్భాల్లో ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే..తమ బంధువులు విదేశాల్లో ఉన్నట్లు ఆధారాలు, వాళ్లు కింగ్డమ్ రాలేని పరిస్థితులను పాస్ పోర్ట్ అధికారులకు వివరించాల్సి ఉంటుంది. ఇక విదేశాల్లో ఉంటున్న సౌదీ పౌరులు, వారి మీద ఆధారపడే వారు ప్రయాణ అనుమతులకు సంబంధించి మినహాయింపు పొందే మూడో వర్గంలోకి వస్తారు. వారు విదేశాల్లో ఉంటున్నట్లు, ఏ దేశంలో ఉంటున్నారో ఆధారాలు చూపించి ప్రయాణ అనుమతి పొందవచ్చు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







