మస్కట్: ఒకే రోజు ఐసీయూకి 200 మంది కోవిడ్ పేషెంట్లు
- September 27, 2020
మస్కట్:ఒమన్ లో కరోనాతో ఐసీయూలో చేరిన వారి సంఖ్య తొలిసారిగా 200 దాటింది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటివరకు ఇంత ఎక్కువ స్థాయిలో ఐసీయూ పేషెంట్ల సంఖ్య నమోదవటం ఇదే మొదటిసారి. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 63 మంది ఐసీయూలో చేరారు. దీంతో ఐసీయూలో చేరిన పేషెంట్ల సంఖ్య 200 మందికి మించింది. ఐసీయూలో పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నా..అది ఆస్పత్రి సిబ్బంది వైఫల్యంగా తాము భావించటం లేదని కోవిడ్ 19 సుప్రీమ్ కమిటీ సభ్యుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని..అదే తరహాలో దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయని, వైద్య సిబ్బంది తమ శక్తివంచన లేకుండా సేవలు అందిస్తోందన్నారు. ఇదిలాఉంటే..ఒమన్ లో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఇప్పటివరకు దేశంలో 97,450 కరోనా కేసులు నమోదయ్యాయి. 87,801 మంది కోలుకున్నారు. 909 మంది వైరస్ తో మృతి చెందారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!