విమాన సర్వీసుల నిషేధం ఉన్న ఆ 32 దేశాల నుంచి ఛార్టెడ్ ఫ్లైట్స్ అనుమతిచ్చిన కువైట్
- September 27, 2020
కువైట్ సిటీ:అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కువైట్ ప్రభుత్వం. అన్ని దేశాల నుంచి విమానాలకు అనుమతి ఇచ్చినా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 32 దేశాల నుంచి మాత్రం విమానాల రాకపోకలను నిషేధించింది. అయితే..ఆ 32 దేశాల నుంచి కూడా ముందస్తు అనుమతులతో ఛార్టెర్డ్ ఫ్లైట్స్ ను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కువైట్ లో పలు ప్రభుత్వ విభాగాల్లో ప్రవాస కార్మికులను సమకూర్చుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించింది. అంతేకాదు..పది కేటగిరిలలో ప్రవాస ఉద్యోగులు, కార్మికులను నియమించుకునేందుకు ఆమోదం తెలిపిన కువైట్..పలు దేశాల నుంచి కార్మికులను తీసుకువచ్చేందుకు వీలుగా ఆ 32 దేశాల నుంచి కూడా ఎట్టకేలకు ప్రత్యేక విమానాల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. అయితే..ప్రత్యేక విమానానికి ముందుగానే ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా ప్రభుత్వ విభాగాలు తమ దగ్గర పనికి కుదిరే సదరు ప్రవాస కార్మికుల పేర్లు, ఏ విధులు నిర్వహిస్తున్న వివరాలను ముందుగా కరోనా నియంత్రణ కమిటీకి సమర్పించి వారి నుంచి నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!