వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం...

వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం...

న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.  రైతు బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఈబిల్లులు చట్టబద్దం అయ్యాయి.  ప్రతిపక్షాలు, కొన్ని మిత్రపక్షాల నుంచి  వ్యతిరేకత వస్తున్నా రాష్ట్రపతి ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేయడం విశేషం.  జూన్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులకు  సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.  కాగా, ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో రైతు బిల్లులను ప్రవేశపెట్టారు.  లోక్ సభలో ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లుపై  రాజ్యసభలో పెద్ద రగడ జరిగింది.  రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, మోజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేశారు.  వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ బిల్లులు దోహదపడతాయని కేంద్రం చెప్తున్నది.  అయితే, ఈ బిల్లుల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.

Back to Top