820 వాహనాలను స్వాధీనం చేసుకున్న రాస్ ఆల్ ఖైమా పోలీసులు
- September 27, 2020
రాస్ ఆల్ ఖైమా:రోడ్ల పక్కన, గ్యారేజ్ లు, ఇతర ప్రాంతాల్లో చాలా కాలంగా వదలేసిన వాహనాలను రాస్ ఆల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత మే నుంచి మొత్తం 820 వాహనాలను జప్తు చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. నిర్వహణ లేకుండా వదిలేసిన వాహనాలు దుమ్ము, ధూళితో అధ్వాన్నంగా మారి సిటీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అలాంటి వాహనాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే ప్రకటించిన పోలీసులు..ఇప్పటికే ఆయా వాహనాల ఒనర్లకు నోటీసులు కూడా జారీ చేశారు. పది రోజుల్లో వాహనాలను అక్కడి నుంచి తీసేయాలని గడువు ఇచ్చారు. నిర్దేశించిన గడువులోగా తీసుకుపోని వాహనాలను రాస్ ఆల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను అమ్మకానికి పెట్టనున్నారు. ఇక నెంబర్ ప్లేట్లు లేకుండా వదిలేసిన వాహనాల విషయంలో నోటీసులు కూడా ఇవ్వబోమని..ఆ మరుక్షణమే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే పాడైపోయిన వాహనాలు, దుమ్ము పట్టి అధ్వాన్నంగా ఉన్న వాహనాలు, నడవటానికి వీల్లేని వాహనాల విషయంలోనూ నోటీసులు ఇవ్వబోమని...వెంటనే సీజ్ చేస్తామని స్పష్టత ఇచ్చారు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







