బంగీ జంప్ మన రాష్ట్రంలో..
- February 11, 2016
బంగీ జంప్.. నడుముకు తాడులాంటి దాన్ని కట్టుకుని అంతెత్తు నుంచి కింద ఉన్న నీటిలోకి దూకే ఓ సాహస విన్యాసం. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేనప్పటికీ విదేశాల్లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సాహస క్రీడ. ఇప్పుడలాంటి అద్భుత అవకాశం మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తోంది. అయితే, విదేశాల్లో ఉన్నట్టుగా ఏ కొండ అంచు నుంచో దూకేలా మాత్రం కాదు. అలనాడు నిజాం జమానాలో రూపుదిద్దుకుని వయసైపోయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఓ పురాతన వంతెన పైనుంచి.సాహస క్రీడలంటే ఎంతో ఆసక్తి చూపే యువతను ఆకట్టుకునేందుకు రాష్ట్రంలో అడ్వెంచర్ టూరిజంను అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం.. ఈ వంతెనను అందుకు వేదిక చేసుకోవాలని నిర్ణయించింది.ఆర్మూరు-నిర్మల్ మధ్య సోన్ వద్ద గోదావరిపై 1936లో ఓ భారీ వంతెనను నిర్మించారు. కిలోమీటరుకు మించిన పొడవున్న ఈ వంతెన నిర్మాణ కౌశలం కూడా కళాత్మకంగా ఉంటుంది. ఇంతకాలం సేవలందించిన ఈ వంతెన వయసైపోయిందన్న ఉద్దేశంతో ప్రభుత్వం దానికి సమాంతరంగా కొత్త వంతెనను నిర్మించి వినియోగంలోకి తెచ్చింది. ప్రస్తుతం పాత వంతెన మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. కానీ ఇప్పటికీ అది పటిష్టంగానే ఉంది.దిగువన గోదావరి, చుట్టూ అందమైన ప్రకృతి, కళాత్మకంగా నిర్మితమై ఉన్న ఆ వంతెనను సాహస క్రీడలకు వినియోగించుకోవాలని ఇటీవల పర్యాటక శాఖ భావించింది. దీనికి ప్రభుత్వం అనుమతించడంతో కార్యాచరణకు సిద్ధమైంది. ఆ వంతెన మీదుగా నదిలోకి మినీ బంగీ జంపింగ్‌కు అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. దీంతోపాటు వంతెన దిగువన నుంచి పైకి రాక్ క్లైంబింగ్‌లాంటివి ఏర్పాటు చేయనున్నారు. వంతెన మీద ఆ ప్రాంత సంప్రదాయాల్ని ప్రతిబింబించే ప్రదర్శనలు, చేతి వృత్తుల ఉత్పత్తులతో ప్రదర్శనలు, ఇతర మేళాలు ఏర్పాటు చేయనున్నారు.దాని మీదుగా కేవలం సైక్లిస్టులు, పాదచారులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఆ వంతెన ప్రాంతాన్ని సందర్శించి స్థానిక అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతం దిగువన గోదావరిలో నీళ్లు లేవు. వచ్చే వానాకాలంలో నీళ్లు చేరిన తర్వాత అవి ఎప్పుడూ నిల్వ ఉండేలా దిగువన మినీ రబ్బర్ డ్యాం నిర్మించే యోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









