ఫ్రాడ్‌ కేసులో ఐదుగురి అరెస్ట్‌

- October 01, 2020 , by Maagulf
ఫ్రాడ్‌ కేసులో ఐదుగురి అరెస్ట్‌

మస్కట్‌: ఐదుగురు వలసదారుల్ని మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో అరెస్ట్‌ చేయడం జరిగింది. బ్యాంక్‌ కస్టమర్లపై ఎలక్ట్రానిక్‌ ఫ్రాడ్‌కి నిందితులు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. టెక్స్‌ట్‌ మెసేజ్‌లను పంపి, బ్యాంకు వినియోగదారుల్ని నిందితులు మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com