అతి పెద్ద అటల్ టన్నెల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- October 02, 2020
న్యూ ఢిల్లీ:హిమాలయ పర్వత శ్రేణుల్లో నిర్మించిన అతి పెద్ద అటల్ టన్నెల్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు. 9.02 కిలోమీటర్ల పొడవైన హైవే సొరంగానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. గుర్రపు డెక్క ఆకారంలో నిర్మించిన ఈ టన్నెల్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీన్ని మనాలీ-లహౌల్-స్పీతీ లోయలను కలుపుతూ నిర్మించారు. టన్నెల్ నిర్మాణంతో ఈ మార్గంలో ఏడాది పొడవునా ప్రయాణించే వీలు కలిగింది. ఎందుకంటే గతంలో మంచు కురిసే సమయంలో దాదాపు 6 నెలలపాటు ఈ లోయకు వెళ్లడానికి రహదారి సౌకర్యం ఉండేదికాదు. ఈ టన్నెల్ గుండా వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన