105 ఇండియన్ పోర్ట్ వర్కర్స్‌కి దక్కని వేతనాలు
- October 03, 2020
కువైట్ సిటీ: 105 మంది ఇండియన్ వర్కర్స్ (అందులో 99 మంది తమిళనాడుకు చెందినవారు), జూన్ నుంచి వేతనాలు అందుకోలేకపోతున్నారు. వీరంతా షుయైబా పోర్టులో పనిచేస్తున్నారు. వేతనాలు అందకపోవడంతో వీరంతా ఇండియన్ ఎంబసీ తమ వేతనాల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. భారత రాయబారి సిబి జార్జి, కార్మికులకు అవసరమైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతామని తెలిపారు. వేతనాలు అందకపోవడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనీ, ఇంటి అద్దె చెల్లించలేక.. పూట గడవడం కూడా కష్టమవుతోందని కార్మికులు వాపోతున్నారు. అక్టోబర్ - డిసెంబర్ మధ్య తమ రెసిడెన్స్ గడువు తీరే అవకాశం వుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేకపోవడంతో ల్యాండ్ లార్డుల నుంచి సమస్యల వస్తాయని ఆవేదన చెందుతున్నారు బాధిత కార్మికులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!