డెలివరీ బాయ్స్ కి ప్రత్యేక లైసెన్సులు..కసరత్తు చేస్తున్న దుబాయ్ అధికారులు
- October 05, 2020
దుబాయ్:త్వరలో డెలివరీ బాయ్స్ కి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దుబాయ్ అధికారులు. దీనికి సంబంధించి అధ్యాయనం కూడా ప్రారంభించారు. దుబాయ్ ఆర్టీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్టడీ రిపోర్ట్ కనుక ఆమోదం పొందితే సాధారణ బైకర్ల తరహాలో కాకుండా బస్సు, ట్రక్ డ్రైవర్ తరహాలోనే డెలివరీ బాయ్స్ ని కమర్షియల్ డ్రైవర్ గా పరిగణిస్తారు. డెలవరీ బాయ్స్ తమ భుజాల వెనక భారీ లగేజీతో ప్రయాణిస్తుంటారని..ఆ లగేజీ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారని అధికారులు వివరించారు. లాక్ డౌన్ సమయంలో వాహనాలపై ఆంక్షలు ఉన్న సమయంలో డెలివరీ బాయ్స్ ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే..ఆ మధ్య కాలంలోనే దాదాపు 12 మంది ప్రమాదాల బారిన పడి చనిపోయారు. కానీ, ఆ ప్రమాదాలన్ని ఏ కారణం లేకుండా బైక్స్ అదుపుతప్పటం వల్ల జరిగినవే. ఇతర వాహనాలపై ఆంక్షలు ఉండటంతో ప్రమాదాల సమయంలో రోడ్లపై రద్దీ కూడా లేదని అధికారులు వెల్లడించారు. తమ అధ్యయనంలో నిర్ధారించుకున్న ఏమిటంటే..డెలివరీ బాయ్స్ భారీ బరువులను భుజానికి వేసుకొని వెళ్లటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో త్వరగా డెలివరీ చేయాలనే ఆత్రూతతో వేగంగా వెళ్లటం కూడా ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొనే డెలివరీ బాయ్స్ కి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







