KVPY 2020 రిజిస్ట్రేషన్ ప్రారంభం
- October 05, 2020
న్యూ ఢిల్లీ:డిగ్రీ విద్యార్ధులకు నెలకు రూ.5,000 లు ఫెలోషిప్ పొందే అద్భుతమైన అవకాశం బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన కేవీపివై అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరపున ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి. ఆసక్తి గల విద్యార్థులు http://http:jvpy.iisc.ernet.in/వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లైకి ఆఖరుతేదీ అక్టోబర్ 19. మొదట అక్టోబర్ 5 ఆఖరు గడువు అని ప్రకటించారు.
కానీ మరింత మంది విద్యార్థులకు అవకాశం ఇచ్చేందుకు వీలుగా గడువును పెంచారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ టెస్ట్ 2021 జనవరి 31న ఉంటుంది. పరీక్షా కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో జరుగుతుంది. అర్హత: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్‌తో పాటు ఎంఎస్సీ, ఎంఎస్ లాంటి కోర్సులు మొదటి సంవత్సరం చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫెలోషిప్ ఎంపిక జరుగుతుంది.
డిగ్రీ విద్యార్థులకు రూ.5,000, మాస్టర్స్ విద్యార్థులకు రూ.7,000 చొప్పున ఫెలోషిప్‌తో పాటు ఏడిదికి ఒకసారి కంటింజెన్సీ గ్రాంట్ లభిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు చేసేవారికి ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్ట్స్‌తో డిగ్రీ, మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1250. ఎస్సీ, ఎస్టీ. దివ్యాంగులకు రూ.625.
డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5,000 చొప్పున మూడేళ్లు, పీజీ విద్యార్థులకు నెలకు రూ.7,000 చొప్పున రెండేళ్లు ఫెలోషిప్ లభిస్తుంది. దీంతో పాటు ఏడాదికోసారి డిగ్రీ విద్యార్థులకు రూ.20,000, పీజీ విద్యార్థులకు రూ.28,000 కంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. విద్యార్థులు తమ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తు http://kvpy.iisc.ernet.in/వెబ్‌సైట్‌లో చేయాలి.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!