మోడీకి 12 అంశాలపై కెసిఆర్ విజ్ఞాపన పత్రాలు..
- February 12, 2016
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. విభజన హామీలు, ఆర్థిక సహాయం, హైకోర్టు విభజన... తదితర 12 అంశాల పైన కెసిఆర్ ప్రధానితో చర్చించారు.వరంగల్ గిరిజన విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇవ్వాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. వార్షిక రుణ పరిమితిని అదనంగా 0.5 శాతానికి పెంచాలని కోరారు. సాధారణ, రైల్వే బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు.కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. టాటా ఇనిస్టిట్యూట్కు అనుమతులు ఇవ్వాలని, అలాగే సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని కూడా కోరారని తెలుస్తోంది.ఉమ్మడి హైకోర్టును విభజించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే నాలుగేళ్లలో రూ.30,571ను గ్రాంటుగా ఇవ్వాలని కోరారు. మిషన్ భగీరథకు రూ.10వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని, ఎయిమ్స్కు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. కరువు సాయాన్ని రూ.3,064 కోట్లు ఇవ్వాలని కోరారు. కెసిఆర్ ప్రధాని మోడీకి పలు అంశాలపై విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు.రాష్ట్రానికి ఐపీఎస్ల కొరత ఉందని, దానిని పూరించాలని కెసిఆర్ కోరారు. ప్రాణహిత - చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







