ఆర్థిక నేరాల కోసం కొత్త ప్రాసిక్యూషన్‌ ఆఫీస్‌

- October 06, 2020 , by Maagulf
ఆర్థిక నేరాల కోసం కొత్త ప్రాసిక్యూషన్‌ ఆఫీస్‌

మనామా‌: బహ్రెయిన్‌, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని డీల్‌ చేయడం కోసం కొత్త ప్రాసిక్యూషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మనీ లాండరింగ్‌ తదితర నేరాలకు సంబంధించిన కేసుల్ని ఇక్క డడీల్‌ చేస్తారు. బహ్రెయిన్‌ అటార్నీ జనరల్‌ అలీ ఫదల్‌ అల్‌ బుయైనైన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రాయల్‌ ఆర్డర్‌ నేపథ్యంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనీ లాండరింగ్‌, టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ వంటివాటిని ఈ కొత్త ప్రాసిక్యూషన్‌ ఆఫీస్‌ ద్వారానే నియంత్రించడానికి చర్యలు తీసుకుంటారు. పబ్లిక్‌ అడ్వొకేట్‌ అలాగే ఇద్దరు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ మెంబర్స్‌ ఈ కార్యాలయంలో వుంటారు. పీనల్‌ కోడ్‌, స్పెషల్‌ క్రిమినల్‌ చట్టాలు, ఫైనాన్షియల్‌ మరియు సూపర్‌వైజరీ లెజిఏ్లషన్‌ వంటివాటిల్లో స్పెషలైజేషన్‌ విభాగం కింద ఈ కార్యాలయం విధులు నిర్వర్తిస్తుంది. ఆర్థిక నేరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ డేటాబేస్‌ పూర్తిస్థాయిలో వుండేలా ఈ కార్యాలయంలో చర్యలు చేపడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com