తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు
- October 09, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా... 18 వందల 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2 లక్షల 8 వేలు దాటినట్టు... వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్క రోజులో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12 వందల 8కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్కరోజులో... 18 వందల 78 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య ఒక లక్షా 80 వేల 953కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26 వేల 374 యాక్టివ్ కేసులు ఉండగా... వీరిలో.. 21 వేల 801 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజులో.. 53 వేల 86 పరీక్షలు నిర్వహించగా... ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 34 లక్షల 49 వేల 925 టెస్టులు నిర్వహించినట్టు.. హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







