తెలంగాణ జాగృతి ఖతార్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన కవిత

- October 12, 2020 , by Maagulf
తెలంగాణ జాగృతి ఖతార్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన కవిత

హైదరాబాద్:తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను మన ఆడబిడ్డలు ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే..

అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న ఖతార్ మహ బతుకమ్మ పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  ఆవిష్కరించారు. 

తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ సారి ఖతార్ ప్రభుత్వ కోవిడ్ నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో ఆడపడుచులు బతుకమ్మలో పాల్గొంటారని కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా రూపకల్పన చేసామని అన్నారు. 

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, బిక్షపతి స్వామి, పసుల చరణ్, ఖతార్ నుండి నర్సయ్య దోనికేని,కో-ఆర్దిడినేటర్ అభిలాష్ బండి తదితరులు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com