కరోనా పేషెంట్స్‌ని గుర్తించేందుకు శునకాల వినియోగం

- October 13, 2020 , by Maagulf
కరోనా పేషెంట్స్‌ని గుర్తించేందుకు శునకాల వినియోగం

మనామా:కరోనా బాధితుల్ని గుర్తించేందుకోసం పోలీస్‌ డాగ్స్‌ని వినియోగించనున్నట్లు బహ్రెయిన్‌ ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నామనీ, మినిస్ట్రీకి చెందిన కె9 యూనిట్‌కి చెందిన పోలీస్‌ డాగ్స్‌ని ఇందుకోసం వినియోగిస్తారు. మెడిక్‌ కె9 డిటెక్షన్‌ సెక్షన్‌, ఈ ప్రత్యేకమైన పద్ధతిలో కరోనా బాధితుల్ని గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. డాగ్స్‌ ద్వారా కరోనాను గుర్తించే పరీక్షల్లో 92.8 సక్సెస్‌ రేట్‌ వుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు డాగ్స్‌కి ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌ ఇచ్చారు. డాగ్స్‌కి ప్రత్యేక శిక్షణతోపాటు, ప్రత్యేక వైద్య సౌకర్యాలూ కల్పిస్తున్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com