మరణ శిక్ష నిబంధనల్ని సవరించిన ఒమన్‌

- October 14, 2020 , by Maagulf
మరణ శిక్ష నిబంధనల్ని సవరించిన ఒమన్‌

మస్కట్: ఒమన్‌ సుల్తాన్‌ హైతం బబిశ్రీన్‌ తరీక్‌, మరణ శిక్షలకు సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ రాయల్‌ డిక్రీని విడుదల చేశారు. యునానిమిటీ ఆఫ్‌ ఒపీనియన్స్‌ లేకుండా క్రిమినల్‌ కోర్ట్‌ మరణ శిక్ష విధించకూడదంటూ ఈ డిక్రీ విడుదలయ్యింది. సుల్తాన్‌ ఆర్డర్‌ ద్వారా ఏర్పాటైన కమిటీకి సదరు కేసు డాక్యుమెంట్‌ని సంపాదల్సి వుంటుంది. సుల్తాన్‌ గ్రాండ్‌ ముఫ్టి లేదా అసిస్టెంట్‌ ఈ ప్యానెల్‌కి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు అనుభవంగల సభ్యుల్ని ప్రెసిడెంట్‌ నియమిస్తారు. షరియా బేస్డ్‌ ఆపీనియన్‌ని ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు. 60 రోజుల్లోగా కమిటీ తన అభిప్రాయన్ని వెల్లడించకపోతే, ట్రిబ్యునల్‌ రూల్‌ కొనసాగుతుంది. యునానిమిటీ లేనిపక్షంలో, మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాల్సి వుంటుంది. అధికారిక గెజిట్‌లో ఈ సవరణను చేర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com